ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం అయింది. ఈ సందర్భాంగా బస్సు ఎక్కి మహిళలతో కలిసి ప్రయాణించారు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్. ఏపీలో ఫ్రీ బస్సు పథకాన్ని ప్రారంభించడానికి మహిళలతో కలిసి ఉండవల్లి నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్.

ఉండవల్లి గుహల వద్ద బస్సు ఎక్కిన చంద్రబాబు, పవన్.. విజయవాడ బస్టాండ్ వరకు ప్రయాణించారు. కాగా, నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే, పర్యాటక, సూపర్ లగ్జరీ, సప్తగిరి, తిరుమల, అల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, ఏసీ బస్సులలో స్త్రీ శక్తి పథకం వర్తించదు.
మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్
ఏపీలో ఫ్రీ బస్సు పథకాన్ని ప్రారంభించడానికి మహిళలతో కలిసి ఉండవల్లి నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ pic.twitter.com/IVA3eyGiCz
— Telugu Scribe (@TeluguScribe) August 15, 2025