నూటికి నూరు శాతం హైటెక్ సిటీ కట్టింది ఎవరయ్య అంటే చంద్రబాబు నాయుడు అనే చెప్పాల్సిందే కదా అని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. జల్సాల కోసం కాదు.. తెలంగాణ ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తున్నా అని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నేను ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ఒకటో సారి, రెండో సారి, మూడోసారి అంటూ కొందరు హేళనగా మాట్లాడుతున్నారన్నారు.

మెట్రో, మూసీ, ఇతర అనుమతులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత అని… కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటే అక్కడికి కాకుండా దుబాయ్ వెళ్తారా..? అని నిలదీశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రికి బంగళా ఇచ్చింది నెలకు నాలుగు రోజులు అక్కడ ఉండి కేంద్ర అనుమతులు తెచ్చుకోవడానికే అని… దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నా అన్నారు. ఢిల్లీలో ఉన్న సీఎం బంగ్లా ఫామ్ హౌస్ కాదు.. దావత్ లు చేసుకోడానికి అని గులాబీ పార్టీకి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.