రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కరువు ఉందని గుర్తు చేస్తూ… రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓ రైతు పుట్టినరోజు సందర్భంగా యూరియా బస్తా గిఫ్ట్ గా ఇచ్చి… తమ నిరసన తెలిపారు. యూరియా కొరత నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శత్రాజ్ పల్లి గ్రామంలో కిషన్ రెడ్డి అనే రైతు పుట్టిన రోజు వేడుకలు చాలా గ్రాండ్గా నిర్వహించారు.

ఈ సందర్భంగా తన తోటి మిత్రులందరికీ యూరియా బస్తాలు బహుమతిగా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత కనిపిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం ఇవ్వడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే… రైతులు మాత్రం.. దుకాణాల ముందు క్యూ కడుతున్నారు.
యూరియా కొరత నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శత్రాజుపల్లి గ్రామంలో కిషన్ రెడ్డి అనే రైతు పుట్టినరోజు సందర్భంగా యూరియా బస్తాను బహుమతిగా ఇచ్చిన ఆయన మిత్రులు. pic.twitter.com/pfMzPRttFs
— BIG TV Breaking News (@bigtvtelugu) August 16, 2025