ఒడిశాలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లుగా జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో వెళ్లడైంది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలలో దాదాపు 20 మెట్రిక్ టన్నుల వరకు బంగారం నిల్వలు ఉన్నట్లుగా అంచనా వేశారు. ఇతర దేశాల నుంచి పెద్ద మొత్తంలో బంగారం దిగుమతి చేసుకునే భారతదేశంకు ఇది కాస్త ఊరటనిస్తోంది. ఇప్పటికే బంగారం మైనింగ్ కు సంబంధించి ఒడిశా ప్రభుత్వం శరవేగంగా పనులను నిర్వహించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే వేలం నిర్వహించాలన్నారు.

ఇదిలా ఉండగా…. రోజురోజుకీ బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు పైనే ఉంది. దీంతో సామాన్య మానవులు బంగారం కొనుగోలు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వివాహ సమయంలో అమ్మాయిలకు బంగారం కానుకలుగా ఇస్తారు. ప్రస్తుతం లక్ష రూపాయలకు పైనే బంగారం ధర పెరగడంతో సామాన్య మానవులు వారి అమ్మాయిల వివాహానికి బంగారం కొనడానికి చాలా ఇబ్బందులను పడుతున్నారు. బంగారం ధరలు తగ్గించాలని వేడుకుంటున్నారు.