గత వారం రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ములుగు జిల్లాను వర్షాలు భారీగా ముంచేత్తాయి. ఏటూరు నాగారంలో మూడు గంటలలోనే సుమారు 20 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదు అయినట్లుగా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. భారీ వర్షాలకు తెలంగాణలోని పలు ప్రాంతాలలో వాగులు, వంకలలో జలపాతాలు ఉప్పొంగుతున్నాయి.

పలుచోట్ల రహదారుల పైకి నీరు భారీగా చేరడంతో రోడ్లమీద వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బొగత జలపాతం వీక్షించేందుకు అనుమతిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. కానీ నీటిలోకి దిగే అవకాశం మాత్రం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాలలో జలపాతాలను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు వెళ్తున్నారు. నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు జలపాతాల వద్దకు వెళ్లకూడదని చెబుతున్నారు.