ముంబైలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దింతో రైళ్లు, విమాన రాకపోకలకు అంతరాయం నెలకొంది. ముంబైతో పాటు మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరపి లేని వర్షాల కారణంగా నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకాలో ఐదుగురు గల్లంతు అయ్యారు.

రైళ్లు, విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంబై, ఠాణె, రాయగడ్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది.