బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్న ధురంధర్ మూవీ సెట్లో ఫుడ్ పాయిజన్
ఆసుపత్రి పాలైన 120మంది సిబ్బంది
లద్దాఖ్‌లోని లేహ్ జిల్లాలో జరుగుతున్న మూవీ షూటింగ్
బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ సినిమా నేపథ్యంలో తీవ్ర విషాదం నెలకొంది. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్న దురంధర్ మూవీ సెట్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం వచ్చిన 120 మంది సిబ్బంది ఆసుపత్రి పాలయ్యారు.

లద్దాఖ్‌లోని లేహ్ జిల్లాలో మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే నిన్న అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం వచ్చిన 120 మంది సిబ్బంది ఆసుపత్రి పాలయ్యారు. వాళ్ళు ప్రస్తుతం ఆస్పత్రిలోనే ఉన్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.