నటి రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది తనదైన నటన, అందచందాలతో ప్రేక్షకుల మనసులను ఎంతగానో దోచుకుంది. ఈ చిన్నది నటించిన సినిమాలన్ని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. తెలుగు, హిందీ అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోతుంది. ప్రస్తుతం ఈ చిన్నది నటిస్తున్న హారర్ కామెడీ యూనివర్సిటీ “థామా” సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఇందులో ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధికి, రష్మిక, పరేష్ రావల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక టీజర్ లో అదిరిపోయే బిజిఎం, విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. టీజర్ లో రష్మిక లిప్ లాక్ సీన్ ఉండడంతో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకు ఆదిత్య సర్పొత్దార్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ టీజర్ హాట్ టాపిక్ గా మారుతోంది. ఇందులో రష్మిక లిప్ లాక్ సన్నివేశాలు వైరల్ అవుతున్నాయి. టీజర్ చూసిన అనంతరం సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. వారి అంచనాలకు తగినట్లుగా ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలని ప్రతి ఒక్కరూ అంటున్నారు.
AYUSHMANN – RASHMIKA: THE WORLD OF THAMA IS HERE – DIWALI 2025 RELEASE… This looks TERRIFIC… After the phenomenal success of #Stree2 and #Munjya, it's time for the next chapter in the horror-comedy universe – #Thama.#DineshVijan has unveiled a glimpse of this… pic.twitter.com/Aur1LUaWEj
— taran adarsh (@taran_adarsh) August 19, 2025