వర్షాకాలంలో తేమ కారణంగా బియ్యంలో పురుగులు రావడం సహజం. ఇది ప్రతి ఇంట్లో ఎదురయ్యే సాధారణ సమస్య. కొందరు బియ్యాన్ని ఎక్కువ మొత్తంలో తెచ్చుకోకుండా, పురుగు పడతాయి అన్న భయంతో పది రోజులకి లేదా కొన్నిరోజులకి సరిపోయేటట్టు తెచ్చుకునే వారు ఉన్నారు. బియ్యం లో పురుగులు ఉంటే కొంతకాలానికి బియ్యం రుచి కూడా మారిపోతుందని ఆ పురుగులు రాకుండా చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు ఇంట్లో ఆడవాళ్లు.అయితే బియ్యం ఇంట్లో ఎన్ని ఉన్నా పురుగు పట్టకుండా వర్షాకాలంలో కొన్ని టిప్స్ పాటించడం ముఖ్యం. మరి బియ్యాన్ని కాపాడుకునే సులభమైన పద్ధతులను తెలుసుకుందాం..
వర్షాకాలంలో తేమ వలన పురుగులు ఎక్కువగా ఇళ్లల్లో చేరుతాయి. బియ్యాన్ని టైట్ కంటైనర్ లో స్టోర్ చేయండి. తేమ రాకుండా చేస్తే పురుగులు దరి చేరవు. కంటైనర్ ను ఎండలో ఆరబెట్టి ఆ తర్వాత ఉపయోగించండి. ప్రతినెలా బియ్యం తెచ్చుకున్నప్పుడు కంటైనర్ ను కొంతసేపు ఎండలో ఉంచి ఆ తరువాత బియ్యం అందులో స్టోర్ చేయండి.
బియ్యం కంటైనర్ లో నాలుగు, ఐదు తమలపాకులు వేయండి. ఇవి సహజంగా పురుగులను దూరం చేస్తాయి. తమలపాకులు సురక్షితమైనవి ఖర్చులేని పరిష్కారం ప్రతినెలా ఒకసారి ఈ తమలపాకులు మార్చి మళ్లీ కొత్త తమలపాకులు బియ్యం లో వెయ్యండి.

అందరికీ తెలిసిన మరో చిట్కా 10 నుంచి 15 లవంగాలను బియ్యంలో వేసి ఉంచడం. చిన్న కాటన్ బ్యాగ్ లో లవంగాలను వేసి కంటైనర్ లో ఉంచండి లవంగాలు లో ఉండే సుగంధం పురుగులను తరిమేస్తుంది బియ్యం రుచిని పాడు చేయకుండా ఉంటుంది.
ఎండిన వేప ఆకులను బియ్యంలో చల్లండి. వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పురుగులను నివారిస్తాయి. వేపాకులు బియ్యాన్ని ఫ్రెష్ గా ఉంచుతాయి. రూపాయి ఖర్చు లేకుండా ఇంటి బయట ఉండే వేపాకులని తెచ్చి బియ్యం కంటైనర్ లో వేయండి.
ప్రతివారం బియ్యాన్ని చెక్ చేసుకోండి పురుగులు కనిపిస్తే బియ్యాన్ని శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టండి. ప్రతిరోజు బియ్యాన్ని వాడేటప్పుడు చేతులు పొడిగా ఉండేటట్లుగా చూసుకోండి. తడి చేతులు బియ్యం లో తగలడం వల్ల తొందరగా పురుగు చేరుతుంది. బియ్యం లో వాడే గ్లాస్ ను పొడిగా ఉండేలా చూసుకోండి.
ఈ సింపుల్ ట్రిక్స్ తో వర్షాకాలంలో బియ్యం పురుగు పట్టకుండా సేఫ్గా ఉంచవచ్చు తమలపాకులు, లవంగాలు, వేపాకు వంటి సహజ పదార్థాలతో బియ్యం ఫ్రెష్ గా రుచిగా ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీ వంటింటి సమస్యను దూరం చేయండి.