సినిమా ఇండస్ట్రీలో చాలామంది కమెడియన్లు ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది పాపులర్ అయితే మరికొంతమంది ఒక్కసారి మెరిసి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్తారు. అలాంటి వారిలో వెంకీ సినిమా కమెడియన్ రామచంద్ర ఒకరు. రవితేజ సినిమాల్లో ఎక్కువగా ఈతగాడు కనిపిస్తాడు. ముఖ్యంగా రవితేజ హీరోగా చేసిన వెంకీ సినిమాలో.. ఫ్రెండ్ పాత్రలో మెరిశారు రామచంద్ర.

అయితే అలాంటి ఫేమస్ నటుడు ప్రస్తుతం మంచం పట్టారు. తీవ్ర అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్నారు రామచంద్ర. కొన్ని రోజుల కిందట పక్షవాతానికి గురైన రామచంద్ర… దీనస్థితిలో ఉన్న వీడియో వైరల్ గా మారింది. బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టడంతో ఎడమ చేయి అలాగే కాలు పనిచేయడం లేదని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. కాగా డీజే టిల్లు, సార్ సినిమాల్లో కూడా చిన్న పాత్రలో కనిపించారు. అంతకుముందు గౌతమ్ ఎస్ఎస్సి, ఆనందం అలాగే సొంతం లాంటి సినిమాల్లో కూడా కనిపింది చేశారు.