ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో వైసీపీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో NDAకు మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు బొత్స సత్యనారాయణ. ఈ నెల 21వ తేదీ అంటే ఇవాళ నామినేషన్ల స్వీకరణకు చివరి గడువు ఉంది. 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 25 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు విధించారు.

సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. అదే రోజు కౌటింగ్ కూడా నిర్వహిస్తారు. రాజ్యసభ, లోక్ సభలో ప్రస్తుత ఎంపీల సంఖ్య 786గా ఉంది. ఉప రాష్ట్రపతి గెలవాలంటే 394 ఎంపీల బలం ఉండాలి. జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, NDA కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ఫైనల్ అయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్న సీపీ రాధాకృష్ణన్ ను ప్రకటించారు.