చిరంజీవి ప్రయాణం ఎంతో మందికి స్పూర్తి: CM చంద్రబాబు

-

టాలీవుడ్ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. “చిరంజీవి గారికి 70వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. సినిమా, ప్రజా జీవితంలో మీ అద్భుతమైన ప్రయాణం ఎంతో మందికి స్పూర్తిని ఇఛ్చింది. దాతృత్వం, అంకిత భావంతో మీరు ఇలాగే చాలా మంది జీవితాలను స్పృశించడం కొనసాగించాలి. మీకు మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని, రాబోయే ఏళ్లు మరింత చిరస్మరణీయంగా కావాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు. 

chiru

ఇక మెగాస్టార్ చిరంజీవికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానుల నుంచి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సినిమా, సమాజానికి మీరు చేసిన అద్భుతమైన కృషి గర్వకారణం, స్పూర్తిదాయకం అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. వీరితో పాటు తెలుగు రాష్ట్రాల మంత్రులు, సినీ హీరోలు, దర్శకులు విషెష్ తెలియజేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news