మహాభారతంలో కుంతి త్యాగం.. భక్తి, ధర్మానికి నిదర్శనం!

-

పురాణ ఇతిహాసాలలో మహాభారతంకు ఎంతో ప్రాముఖ్యత కలదు. హిందూ సాంప్రదాయంలో మహాభారతం ఓ గొప్ప ఇతిహాసమే కాక, ఎన్నో సమస్యలకు పరిష్కారం. వింటే భారతమే వినాలి తింటే గారెలే తినాలి అనే సామెత పూర్వం నుంచి మనం వింటున్నాం. మహాభారతం మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు పరిష్కారాలను ఆధ్యాత్మిక భావాలను ప్రేరేపిస్తుంది. ఈ మహాభారతంలో అనేక పాత్రలు మన జీవన విధానానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. అందులో కుంతి పాత్ర ఎన్నో త్యాగాలకు ప్రతీకగా నిలిచింది. ఆమె జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. అలాంటి కుంతి దేవి గురించి, ఆమె త్యాగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

మహాభారతంలో కుంతి పాత్ర కేవలం ఒక రాణిగానో ఐదుగురు వీరులైన పాండవులకు తల్లిగాను మాత్రమే కాదు. ఆమె జీవితం నిస్వార్ధ త్యాగానికి కఠినమైన నిర్ణయాలకు ప్రతీక. ఆమె చేసిన ప్రతి త్యాగం ధర్మాన్ని కుటుంబాన్ని కాపాడడానికి అందుకే కుంతీ త్యాగం అందరికీ ఆదర్శం.

కుంతీ జీవితంలో ఎన్నో కష్టాలను ఒంటరితనాన్ని అనుభవించింది. చిన్నతనంలో దుర్వాస మహర్షి ఇచ్చిన వరం వల్ల ఆమెకు పెళ్లికి ముందే సూర్యుడి ద్వారా కర్ణుడు జన్మిస్తాడు. లోకనిందకు భయపడి ఆ బిడ్డను నదిలో వదిలేయడం ఆమె జీవితంలో అత్యంత బాధాకరమైన త్యాగం. ఒక తల్లికి తన బిడ్డను దూరం చేసుకోవడానికి అంటే పెద్ద త్యాగం మరొకటి ఉండదు. అయినా ఆమె తన భవిష్యత్తు కోసం తన గౌరవాన్ని కాపాడడానికి ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోక తప్పలేదు.

Mahabharata’s Kunti – A Testament to Dharma and Motherly Devotion
Mahabharata’s Kunti – A Testament to Dharma and Motherly Devotion

ఆ తర్వాత ఆమె పాండురాజుతో వివాహం జరిగింది. వివాహమాడిన మరుసటిరోజే పాండురాజు యుద్ధానికి వెళ్లడం, ఆ యుద్ధంలో గెలిచి, మాద్రిని వివాహం చేసుకొని రాజ్యానికి తిరిగి రావడం జరుగుతుంది. పాండురాజు తో ఎటువంటి సుఖాలకు నోచుకోని కుంతీకి, పెళ్లి అయిన వెంటనే సవతిగా మాద్రి రాజ్యానికి రావడం ఎంతో బాధాకరమైన విషయం. కుటుంబ గౌరవానికి విలువనిచ్చి పాండురాజు మీద ఉన్న అభిమానంతో ఆమె మాద్రి ని తన సోదరిగా అంగీకరిస్తుంది. పాండురాజు శాపం కారణంగా రాజ్యానికి దూరమై అడవులలో తన భర్త, మాద్రీలతో కలిసి జీవనం సాగించింది.

పాండురాజు కి శాపం కారణంగా పిల్లలు కలగకపోవడంతో ఆమె దుర్వాస మహర్షి వరం సహాయంతో కురు వంశానికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు వంటి వీరులను అందించింది. అంతేకాక మాద్రి కి నకుల, సహదేవులను కనడానికి సహాయం చేసింది. ఇవన్నీ ఆమె త్యాగాల్లో భాగమే. పాండురాజు మరణం తర్వాత మాద్రి సహజీవనం చేస్తుంది. ఇక కుంతి మాద్రి పుత్రులను కూడ తన సొంత బిడ్డల్లా పెంచి వారికి రాజధర్మం గుణగణాలను నేర్పింది.

కుంతి మరో గొప్ప త్యాగం మహాభారత యుద్ధ సమయంలో కనిపిస్తుంది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు కర్ణుడిని కలిసి పాండవుల పక్షాన పోరాడమని కోరుతుంది. ఒకవైపు తన మొదటి కుమారుడు, మరోవైపు తన ఇతర ఐదుగురు కుమారులు. వారి మధ్య యుద్ధం జరగడం ఆమెకు ఎంతో బాధని కలిగించింది. ఈ సమయంలో కర్ణుడు తల్లి మాట వినలేదు కుంతి ఆ బాధను తనలోనే దాచుకొని పాండవుల ధర్మాన్ని కాపాడడానికి నిలబడింది. కర్ణుడు చనిపోయిన తర్వాత పాండవులకు నిజం చెప్పి కర్ణుడు తన బిడ్డ అని తన మిగిలిన పుత్రులకు తెలిపింది.

కుంతీ తన వ్యక్తిగత కష్టాలను,కోరికలను పక్కనపెట్టి ధర్మాన్ని తన కుటుంబ గౌరవాన్ని కాపాడడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలబడింది. ఆమె త్యాగం, తల్లిగా ఆమెలో గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అందుకే కుంతి జీవితం అందరికీ ముఖ్యంగా స్త్రీలకు ఎంతో స్ఫూర్తిగా నిలిచింది. ధర్మం కోసం కుటుంబం కోసం వ్యక్తిగత సుగాలను త్యాగం చేయడంలో ఆమె గొప్పతనం దాగి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news