ఏపీ సీఎం చంద్రబాబుకు కొత్త పథకాల ఆలోచన ఎప్పుడూ రాదని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పథకాలను కాపీ కొట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో కాకాణి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎరువులు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. కీలక సమయంలో రైతులకు ఎరువులు అందలేదు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆర్బికేల ద్వారా అన్ని సమకూర్చాము. కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. రైతాంగాన్ని పట్టించుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. రైతులని అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నారు. రైతుల సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. రైతులను అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్న దుస్థితిలో ప్రభుత్వం ఉంది. అవినీతి సొమ్మును కూడా పెట్టే పనిలో మంత్రులు ఉన్నారు. మంత్రి అచ్చెన్నాయుడుకి నైతికత ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. ఆగ్రోస్ ఎండీ ద్వారా లంచాలు గుంజాలని చూసిన వ్యక్తి అచ్చేన్నాయుడు.