ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదు : మంత్రి శ్రీనివాస్

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లను తొలగిస్తోందన్న వైసీపీ ఆరోపణలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. 15 నెలల్లో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదు. 65 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నాం. గతంలో కొందరూ నకిలీ సర్టిఫికెట్లతో దివ్యాంగ పెన్షన్ కి దరఖాస్తు చేసుకున్నారు. అందుకే 80 వేల మందికి నోటీసులు ఇచ్చామని.. తగిన సర్టిఫికెట్ చూపిస్తే పెన్షన్ వస్తుంది. 9 నెలల నుంచి పెన్సన్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుందని తెలిపారు మంత్రి శ్రీనివాస్.

srinivas

మరోవైపు గతంలో సదరం సర్టిఫికెట్లు అక్రమంగా పొందిన వారిపై పున:పరిశీలన చేశారని.. అనర్హులను గుర్తించి.. నకిలీ పెన్షన్లను మాత్రమే తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు కొనసాగుతాయని… ఎవ్వరూ ఆందోళన చెందవద్దని సూచించారు. గత ప్రభుత్వంలో కొందరూ అక్రమంగా సదరం సర్టిఫికెట్లు తీసుకున్నారని అధికారులు సీఎం కు తెలిపారు. దీంతో చాలా మంది అనర్హులు కూడా పెన్షన్లు పొందుతున్నారని చెప్పారు. అన్ని విధాలుగా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండి.. ఎలాంటి వైకల్యం లేకుండానే కొంత మంది పెన్షన్ పొందుతున్నట్టు పరిశీలనలో తేలిందని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news