బీపీ రోగులు చేసే ఒక పెద్ద తప్పు ఏమిటంటే, మందులు వాడుతూ బీపీ క్రమంగా తగ్గగానే వాటిని ఆపేయడం. “ఇప్పుడేమో బీపీ కంట్రోల్‌లోకి వచ్చింది కాబట్టి మందులు అవసరం ఉండకపోవచ్చు” అనే భావనతో చాలామంది అజాగ్రత్త చేస్తారు. కానీ ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు. వైద్యుల సూచన లేకుండా మందులు ఆపేయడం వల్ల రక్తపోటు మళ్లీ పెరిగే ప్రమాదం ఉంది.ఇంకొందరు తగ్గింది లే అని అశ్రద్ధతో, ఆత్మవిశ్వాసంతో మందులు ఆపేస్తారు. “ఇక అవసరం లేదు” అనుకుంటారు. ఇది కూడా తప్పుడు నిర్ణయం. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, బీపీ ఒక దీర్ఘకాలిక వ్యాధి. కాబట్టి మందులు వైద్యుల సూచన ప్రకారమే వాడాలి. తగ్గిందని అనుకుని, మర్చిపోయి, లేక నిర్లక్ష్యంగా ఆపేయడం వల్ల ప్రమాదాలు తప్పవు. ఎలాంటి ప్రమాదాలు వస్తాయో ఇప్పుడు చూద్దాం…
బీపీ మందులు రక్తపోటును అదుపులో ఉంచి గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి. ఒకసారి బీపీ సాధారణ స్థాయికి వచ్చేనా అది కేవలం మందుల ప్రభావం వాళ్ళ మాత్రమే మందులు ఆపేస్తే శరీరంలో రక్త పోటు మళ్ళీ పెరుగుతుంది దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి.
మందులు హఠాత్తుగా ఆపేయడం వల్ల రక్తపోటు ఒకసారి గా పెరిగిపోతుంది. దీనిని హైపర్టెన్సివ్ క్రైసిస్ అంటారు దీనివల్ల తీవ్రమైన తలనొప్పి, కళ్ళు తిరగడం శ్వాస ఆడక పోవడం జాతిలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి ఇలాంటి పరిస్థితిలో తక్షణమే వైద్య సహాయం తీసుకోవడం అవసరం.

అధిక రక్తపోటు గుండె మరియు మెదడులో రక్తనాళాల పై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ ఒత్తిడి వల్ల రక్తనాళాలు దెబ్బతిని గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మందులు ఆపడం వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువవుతుంది.
దీర్ఘకాలికంగా అధిక రక్తపోటు కొనసాగితే కిడ్నీలు, కళ్ళు గుండె వంటి కీలక అవయవాలు దెబ్బతింటాయి మందులు ఆపడం వల్ల బిపి నియంత్రంలో ఉండదు, దీనివల్ల అవయవాలకు ఎక్కువగా నష్టం జరుగుతుంది. కొన్ని రకాల బీపీ మందులు ఆపేస్తే వాటి ప్రభావం ఒక్కసారిగా తగ్గిపోయి రక్తపోటు విపరీతంగా పెరిగిపోతుంది దీనినే రీబాౌండ్ ఎఫెక్ట్ అంటారు దీని వల్ల ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.
వైద్యుల సలహా లేకుండా ఎప్పుడు బీపీ మందులు ఆపకూడదు. మీ బీపీ స్థాయి మెరుగుపడిన మందుల మోతాదును తగ్గించాలా లేదా పూర్తిగా ఆపాల అనేది డాక్టర్ నిర్ణయిస్తారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది.
(గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహనా కోసం మాత్రమే,ఎటువంటి సమస్య వున్నా డాక్టర్ ను సంప్రదించండి.)