దమ్ముంటే 10 మంది ఎమ్యెల్యేలు రాజీనామా, మళ్ళీ గెలవాలి – KTR

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి విజయం సాధించాలని కేటీఆర్ అన్నారు. 20 నెలల పాలన చూపించి ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది. హైడ్రా పేరుతో హైదరాబాద్ మహానగరాన్ని అతలాకుతలం చేశారు. చాలామంది జీవితాలను రోడ్లమీద పడేశారు.

Revanth-KTR
Revanth-KTR

దుర్గం చెరువు FTL లో ఉన్న రేవంత్ రెడ్డి అన్న తిరుపతిరెడ్డి ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కేటీఆర్ మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కేటీఆర్ మాట్లాడిన ఈ మాటలపై సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనపై మండిపడుతున్నారు. అభివృద్ధి పేరుతో హైదరాబాద్ మహా నగరాన్ని నాశనం చేశాడని ఫైర్ అవుతున్నారు. చాలామంది బతుకులను రోడ్డు మీద పెట్టాడని రేవంత్ రెడ్డి పాలన అస్సలు మంచిగా లేదని అంటున్నారు. అభివృద్ధి పేరుతో రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు ఏమాత్రం బాగోలేదని తిడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news