భారతదేశంలో జరుపుకునే పండుగలలో వినాయక చవితికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పండుగను దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రతి ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్దశి రోజున వినాయక చవితిని జరుపుకోవడం ఆనవాయితీ. ఆరోజున వినాయకుడి జన్మించాడని నమ్మకం. ఈ ఈ పండుగ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరి ఈ సంవత్సరం వినాయక చవితి ఏ రోజున వచ్చిందో తెలుసుకుందాం..
ప్రజల్లో వినాయక చవితి తేదీపై గందరగోళం ఏర్పడింది. పండుగను ఆగస్టు 26న జరుపుకోవాలా లేక 27న చేస్తారా అనే సందేహం ఉంది. పండితుల అభిప్రాయం ప్రకారం, 2025లో వినాయక చవితిని బాద్రపద శుక్ల చవితిన ఆగస్టు 27న జరపాలి. పూజకు ముఖ్యమైన ముహూర్తం ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు అని పండితులు సూచిస్తున్నారు. వినాయక నిమజ్జనం సెప్టెంబర్ 6న నిర్వహించాల్సిందిగా సలహా ఇచ్చారు.

వినాయక చవితి రోజున భక్తులు గణపతి మట్టి విగ్రహాలను ఇంటికి తీసుకు వస్తారు. వాటిని అలంకరించి గణేశుడికి ఇష్టమైన మోదకాలు, లడ్లు, ఉండ్రాళ్ళు వంటి ప్రసాదాలను సమర్పిస్తారు. ఇవి ఆయనకు ప్రీతిపాత్రమైనవి. 21 రకాల పత్రాలతో వినాయకుడి పూజించడం ఈ పండుకులో ఒక ముఖ్యమైన ఆచారం దీనినే పత్రి పూజ అని అంటారు. ఈ పూజ చేయడం వల్ల అన్ని రకాల పాపాలను నశించి, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు.
వినాయక చవితి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది కుటుంబ సభ్యులందరినీ కలిపి మన సాంప్రదాయాలను సంస్కృతిని కాపాడే ఒక గొప్ప వేడుక. ప్రతి ఇంట్లో ఈ పండుగ వాతావరణం నెలకొని భక్తి వెల్లివిరుస్తుంది. ఈ పండుకు రోజున భక్తిశ్రద్ధలతో గణపతిని పూజిస్తే ఆటంకాలని తొలగిపోయి జీవితం విజయం లభిస్తుందని నమ్మకం. ఈ సంవత్సరం కూడా పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొని గణపతి అనుగ్రహం పొందండి.