తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత స్పష్టంగా కనిపిస్తోంది. గత నెల రోజులుగా యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. ఫర్టిలైజర్ దుకాణాలు అలాగే వ్యవసాయ కేంద్రాల వద్ద క్యూ లైన్ లో నిలబడి యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం… సరిపడా యూరియా బస్తాలను అందించడం లేదు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే తాజాగా నల్గొండ జిల్లా కేంద్రంలో తెల్లవారుజామునుండే ఆధార్ కార్డులు లైన్లో పెట్టి యూరియా కోసం వేచి ఉన్న రైతుల వీడియో బయటకు వచ్చింది. మొన్నటి వరకు చెప్పులు పెట్టిన రైతులు ఇప్పుడు ఆధార్ కార్డులు పెడుతున్నారు. ఇక మొన్నటికి మొన్న మెదక్ జిల్లాలో మద్యం బాటిల్లను లైన్ లో పెట్టి నిరసన తెలిపారు రైతులు.