వీధి కుక్కలకు టీకాలు, స్టెరిలైజేషన్ వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన వేల కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కనీసం 70% శునకాలకు స్టెరిలైజేషన్, టీకాలు తప్పనిసరి చేసింది. అనంతరం మళ్లీ వాటిని ఉన్నచోటనే విడిచి పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రాష్ట్రం ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లుగా నెలవారి రిపోర్టును సమర్పించాలని స్పష్టం చేశారు.

కాగా, కొన్ని ప్రాంతాలలో వీధి కుక్కలు రోడ్ల పైన వెళ్లే జనాలను చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. వారిపైన దాడులు చేయడం, మొరగడం చేస్తూ ఉన్నాయి. దీనివల్ల రోడ్ల పైన వెళ్లే ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాలలో చిన్నపిల్లలను సైతం వీధి కుక్కలు వెంటపడి గాయాలపాలు చేస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, టీకాలు తప్పనిసరి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. టీకాలు వేయడం వల్ల వీధి కుక్కలకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.