టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ కు కూడా దూరం కాబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తాజాగా ఓ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే.. అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన అశ్విన్ కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో పెద్దగా అవకాశాలు వచ్చే ఛాన్సులు కనిపించడం లేదు.

దీంతో ముందుగానే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు అశ్విన్. తాజాగా రిటర్మెంట్ ప్రకటించడంతో వచ్చే ఏడాది నుంచి… అశ్విన్ లేకుండానే ఐపీఎల్ జరగనుంది. అశ్విన్ ప్రకటనతో ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇంకో ఏడాది ఐపీఎల్ ఆడితే బాగుండేది కదా అని అంటున్నారు.