సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నాడు. నేడు వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ రివ్యూ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారీ వర్షాలకు జలమయమైన కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలను నేడు హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించనున్నారు రేవంత్ రెడ్డి.

కాగా మెదక్, కామారెడ్డి జిల్లాను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా అంతా అతలాకుతలం అయింది. దింతో జలదిగ్బంధంలో పలు గ్రామాలు చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలో ఇవాళ పలు విద్యాసంస్థలకు, ఆఫీసులకు సెలవు ప్రకటించారు అధికారులు.