తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలోని మరో ఆరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల, నల్గొండ, యాదాద్రి, కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల, జిల్లాల్లో కూడా హాలిడే ప్రకటన చేశారు. ఇప్పటికే కామారెడ్డి, మెదక్, నిర్మల్, అదిలాబాద్, అసిఫాబాద్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ఇస్తూ నిన్ననే ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా… ఇవాళ నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేవలం ఈ ఐదు జిల్లాలకు మాత్రమే రెడ్ అలర్ట్ ఉంది. అలాగే మంచిర్యాల, అసిఫాబాద్, భువనగిరి, రాజన్న సిరిసిల్ల, అదిలాబాద్, జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన పలు జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.