కోలీవుడ్ స్టార్ హీరో ఆర్ మాధవన్ జమ్మూ కాశ్మీర్ లో వర్షాలలో చిక్కుకుపోయాడు. షూటింగ్ కోసం కాశ్మీర్ లోని లేహ్ ప్రాంతానికి వెళ్ళిన మాధవన్ భారీ వర్షాల కారణంగా అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది. ఎడతెరపి లేకుండా జమ్మూ కాశ్మీర్ లో వర్షాలు కురవడంతో విమానాలు సైతం రద్దు అయ్యాయి. ఈ విషయాన్ని నటుడు ఆర్ మాధవన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. 17 సంవత్సరాల క్రితం రోజులను ఆర్ మాధవన్ గుర్తు చేసుకున్నారు.

కాగా, జమ్మూ కాశ్మీర్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని కొంతమంది ప్రజలు వారి ప్రాణాలను కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. వరదలలో చిక్కుకున్న ప్రజలను కాపాడుకునేందుకు రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. కాగా మరో రెండు మూడు రోజుల పాటు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు.