ఒకవైపు వరదలతో ప్రజల ప్రాణాలు పోతుంటే, రేవంత్ రెడ్డి ఏమో మూసీ సుందరీకరణ మీద, ఆటల పోటీల మీద రివ్యూలు చేస్తున్నాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహించారు. మెదక్ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పర్యటించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ… రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించినట్లు ఉంది రేవంత్ రెడ్డి తీరు ఉందని మండిపడ్డారు.

నిన్న ఒక మంత్రి హెలికాప్టర్‌ను అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలని అంటున్నాడు.. వాళ్లేమో పెళ్ళికి, బీహార్‌లో రాజకీయాలకు వాడుతారని నిప్పులు చెరిగారు. . వరదలో చిక్కుకొని ఇద్దరు యువకులు మృతి చెందారు.. ఇది ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు. వారు కొన్ని గంటల పాటు కరెంట్ పోల్‌కు పట్టుకొని తమను రక్షించాలని వేడుకున్నారు, సహాయం కోసం ఎదురు చూశారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగానికి సమాచారమిచ్చినా వారు పట్టించుకోలేదు.. మధ్యాహ్నం కరెంట్ పోల్ కూడా కొట్టుకుపోయి ఆ ఇద్దరు యువకులు చనిపోయారని ఎమోషనల్ అయ్యారు హరీష్ రావు.