స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కేటీఆర్‌ను జూపల్లి కృష్ణారావు అనుచరుడు, గద్వాల్ మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ కలిశారు. కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలో మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్, 10 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు చేరనున్నారు.

వచ్చేనెల 6న లేదా 10న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నట్లు ప్రకటన చేయనున్నారు. గద్వాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు వందలాది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు. దింతో స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది.