KTR and Bandi Sanjay clash: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వరదలు సంభవించాయి. నిన్నటి నుంచి అత్యంత ప్రమాదకరమైన వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఎగువ మానేరు మత్తడి దుంకుతోంది. దీంతో సిరిసిల్ల జిల్లాలో భారీ వరదలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బండి సంజయ్ అలాగే కేటీఆర్ ఇద్దరు కూడా సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు.

అనుకోకుండా గంభీరావుపేట మండలంలో ఇద్దరు ఎదురెదురు పడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ అలాగే బండి సంజయ్ ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా… భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలను పరిశీలించేందుకు సిరిసిల్ల నియోజకవర్గం చేరుకున్నారు కేటీఆర్. గంభీరావుపేట మండలం, మల్లారెడ్డిపేట బ్రిడ్జిపై నుంచి అప్పర్ మానేరు వరద ఉధృతిని పరిశీలించారు కేటీఆర్.
Bandi Sanjay and KTR at Sircilla pic.twitter.com/xlpC7BoA2J
— Naveena (@TheNaveena) August 28, 2025