విటమిన్ డి అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం, దీన్ని సూర్యరశ్మి విటమిన్ అని కూడా అంటారు. ఎందుకంటే మన చర్మం సూర్యరశ్మికి గురైనప్పుడు ఈ విటమిన్ తయారవుతుంది. ఇది మన ఎముకలు రోగనిరోధక శక్తి, కండరాలు నరాల ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే విటమిన్ D రెండు ప్రధాన రూపాలు D2 (ఎర్గోకాల్సిఫెరాల్) మరియు D3 (కోలీకాల్సిఫెరాల్). విటమిన్ D అనే పదం సాధారణంగా ఈ రెండు రకాలను సూచిస్తుంది. వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలుసుకుందాం ..
విటమిన్ D2 మొక్కలు, శిలీంధ్రాలు, పుట్టగొడుగుల నుండి వస్తుంది, అయితే విటమిన్ D3 జంతు మూలాల నుంచి చేప నూనె, గుడ్డు సొనలు లేదా చర్మం సూర్యరశ్మి ద్వారా ఉత్పత్తి అవుతుంది. D3 శరీరంలో విటమిన్ D స్థాయిలను ఎక్కువ కాలం, సమర్థవంతంగా పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. D2 కంటే D3 రక్తంలో కాల్షియం శోషణను బాగా మెరుగుపరుస్తుంది.D3 సప్లిమెంట్స్ సాధారణంగా ఎక్కువగా సిఫారసు చేయబడతాయి, ఎందుకంటే ఇవి శరీరంలో సహజంగా ఉత్పత్తి చేస్తాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం విటమిన్ D3 సాధారణంగా ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పై ప్రభావం చూపుతుంది. D3 సప్లిమెంట్స్ శరీరంలో ఎక్కువ కాలం చురుకుగా ఉంటాయి అని నిపుణులు సూచిస్తారు. అయితే, శాకాహారులకు D2 ఒక ఎంపిక. సూర్యరశ్మి, ఆహారం, సప్లిమెంట్స్ మధ్య సమతుల్యం ముఖ్యం.ఉదయం ఎండలో కొంత సేపు నడక వాళ్ళ D విటమిన్ పొందొచ్చు. విటమిన్ D స్థాయిలను రక్త పరీక్ష ద్వారా తెలుసుకొని, వైద్యుడి సలహాతో సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఎందుకంటే అధిక మోతాదు హానికరం.
గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే, వ్యక్తిగత సలహా కోసం వైద్య నిపుణులను సంప్రదించండి.