కల్వకుంట్ల కాదు కల్వకుండా..అంటూ కేసీఆర్ కు కొత్త పేరు పెట్టారు రేవంత్ రెడ్డి.బీసీ బిల్లుపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అసెంబ్ల్యూ మాట్లాడారు. బీసీలు ఓసీలు కల్వకూడదు… ఎస్సీ, ఎస్టీలు కల్వకూడదు… హిందువులు, మైనార్టీలు కల్వకూడదు… ఇప్పటికైనా బీసీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిస్తే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావొచ్చు అని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

50 శాతానికి లోబడే రిజర్వేషన్లు ఉండాలని గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన చట్టాలు గుద్దిబండగా మారాయి అని ఆగ్రహించారు. ఈ చట్టాల వల్ల స్థానిక సంస్థల ఎన్నికలకు ఆటంకంగా మారింది… బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వస్తే సంతోషమని గంగుల అంటున్నారని ఆగ్రహించారు. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాత్రం కడపులో విషం పెట్టుకున్నట్లు గంగుల కామెంట్స్ ద్వారా స్పష్టమవుతోందని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది… రెండు బిల్లులు గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి.