హైదరాబాద్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ నెల 6న హైదరాబాద్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు అమిత్ షా. మధ్యాహ్నం ఒంటి గంటకు చార్మినార్ వద్ద వినాయక నిమజ్జనం శోభాయాత్రలో పాల్గొనున్న అమిత్ షా… షెడ్యూల్ ఖరారు అయింది.

ఇది ఇలా ఉండగా, ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఒకరోజు ముందుగానే ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతిని నిమజ్జనం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఈ నెల అంటే సెప్టెంబర్ ఆరవ తేదీన ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతి నిమజ్జనం ఉంటుందని ఉత్సవ కమిటీ తాజాగా ప్రకటన చేసింది.