పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం “ఓజీ”. ఈ సినిమాకు డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ సుజీత్ పవన్ కళ్యాణ్ కు స్పెషల్ విషెస్ తెలియజేశారు. “ఎంతోమందికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ అని అన్నారు. మీ కోట్లాదిమంది అభిమానులలో నేను కూడా ఒక అభిమానిని.

మీరే నా మొదటి హీరో. ఇప్పుడు నా ఓజీ” అని పేర్కొంటూ “ఓజీ” సినిమాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో ముంబైలోని తాజ్ హోటల్ ఎదురుగా వింటేజ్ ‘DODGE’ కార్ పైన పవన్ కళ్యాణ్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. అందులో ఎంతో స్టైల్ గా పవన్ కళ్యాణ్ ఫోటోకు స్టిల్ ఇచ్చారు. కాగా “ఓజీ” సినిమా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.