ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ అలాగే మెట్రో రైల్ టెండర్లకు గడవు పొడిగించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం. విజయవాడ మెట్రో టెండర్ల గడువు అక్టోబర్ 14వ తేదీ వరకు పొడిగించింది. అలాగే విశాఖ మెట్రో టెండర్ల గడవు అక్టోబర్ ఏడో తేదీ వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన కూడా చేసింది. విజయవాడ అలాగే విశాఖ మెట్రో రైలు నిర్మాణం పైన… మోడీ ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు కేటాయించేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఏపీ ప్రభుత్వానికి భారం కలుగకుండా… మోడీ సర్కార్ వ్యవహరిస్తోంది.