తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నగదు చెల్లింపులను ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ ద్వారా చేపట్టారని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే లబ్ధిదారుల్లో దాదాపు 30% మంది వివరాలు వారి ఆధార్ రికార్డులతో సరిపోవడం లేదని అధికారులు గుర్తించారు. దీనివల్ల పేమెంట్స్ ఆగిపోతాయని అధికారులు పేర్కొన్నారు. ఆధార్ వివరాలలో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దాలని జిల్లా కలెక్టర్లను హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ ఆదేశించారు.

కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది మహిళలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళను అందించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే కొంతమంది ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికయ్యారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని నిరుపేద మహిళలకు ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని అమలులోకి తీసుకువచ్చి ఉచితంగా ఇంటి నిర్మాణ కార్యక్రమాలను చేపడుతోంది. దీంతో తెలంగాణలోని మహిళలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.