తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి సంవత్సరం ఈ బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ బతుకమ్మ. ఆడపడుచులందరూ… దాదాపు తొమ్మిది రోజులపాటు ఈ పండుగను నిర్వహిస్తారు. పెద్ద బతుకమ్మతో.. సంబరాలు ముగుస్తాయి.

అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా బతుకమ్మ వేడుకలను చాలా గ్రాండ్ గా నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రతి జిల్లాకు 30 లక్షలు చొప్పున మొత్తం 1.20 కోట్ల నిధులను కేటాయించి విడుదల చేయడం జరిగింది.
ఈ నెల 21వ తేదీన వరంగల్ వేయి స్తంభాల గుడిలో జరగనున్న సంబరాలతో వేడుకలు మొదలవుతాయి. గిన్నిస్ రికార్డు లక్ష్యంగా 28వ తేదీన lb స్టేడియంలో పదివేల… బతుకమ్మలతో పండగ నిర్వహించనున్నారు. ఇక ఈ నెల 30వ తేదీన ట్యాంక్బండ్ పైన బతుకమ్మ వేడుకలు నిర్వహించి సంబరాలు క్లోజ్ చేస్తారు.