నందమూరి బాలకృష్ణ – క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో సినిమా తెరకేక్కనున్నట్లుగా గత కొంత కాలం నుంచి అనేక రకాల ప్రచారాలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాపై దసరా పండుగ రోజున అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమాకు బాలకృష్ణనే స్వయంగా స్టోరీని అందించినట్లుగా సమాచారం అందుతోంది. గతంలో క్రిష్ జాగర్లమూడి – బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. బాలకృష్ణ ఓవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. హిందూపురం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా బసవతారకం ఆసుపత్రి ద్వారా ఎంతోమంది క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు.