దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని బాంబ్ పేల్చారు దానం నాగేందర్. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నుంచి ఇంకా నోటీసులు రాలేదని వివరించారు. నోటీసులు వచ్చిన తర్వాత అందులో సారాంశాన్ని పరిశీలించి, న్యాయ సలహా తీసుకుని సమాధానం ఇస్తానన్నారు దానం నాగేందర్.

ఇక అటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మాట మార్చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్. నిన్నటిదాకా.. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి చేరారంటూ మహేశ్ ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడేమో.. ఇది ఎమ్మెల్యేలు, స్పీకర్ మధ్య సమస్య అంటూ చేతులెత్తేశారు టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్. ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నారో వాళ్లే చెప్పాలని.. మనం చెప్పొద్దంటూ మాట మార్చారు.