తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కుండపోత వర్షాలు పడనున్నాయి.

నేడు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.