ఏపీలో మహిళా కండక్టర్ ఆవేదన..ఫ్రీ బ‌స్సు వ‌ద్దంటూ

-

ఏపీలోని మహిళలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఉచిత బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆగస్టు 15వ తేదీ నుంచి స్త్రీ శక్తి పేరుతో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. దీంతో మహిళలు ఉచితంగా ఏపీ వ్యాప్తంగా బస్సులలో ప్రయాణిస్తున్నారు. చాలామంది మహిళలు ఫ్రీ బస్సు అని అనవసరంగా ప్రయాణాలు చేస్తున్నారని కొంతమంది మండిపడుతున్నారు.

A female conductor in AP complains about the free bus
A female conductor in AP complains about the free bus

కాగా ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లు పూర్తిగా నష్టపోతున్నామని నిరసన చేపట్టారు. దీంతో ఆటో కార్మికులకు సహాయం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముందడుగు వేశారు. సంవత్సరానికి ఆటో డ్రైవర్లకు రూ. 15 వేల చొప్పున వారి అకౌంట్లలో వేస్తున్నారు. ఇదిలా ఉండగా… ఏపీలో ఉచితంగా బస్సులను పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారంటూ మహిళా కండక్టర్ ఫైర్ అయ్యారు. ఉచితంగా బస్సులను పెట్టి మా జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు. చాలా మంది స్త్రీలు, పురుషులు కండక్టర్లతో దురుసుగా మాట్లాడుతున్నారు. వారికి సమాధానం చెప్పలేకపోతున్నాము. మా ఊపిరి ఆర్టీసీ బస్సులలోనే ఆగిపోయేలా ఉంది. జనాలు ఏమాత్రం మా మాటలను వినడం లేదంటూ మహిళా కండక్టర్ ఫైర్ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news