తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక GO 190 విడుదల చేశారు. జీఓ 317, జీఓ 46పై అభ్యంతరాలకు పరిష్కారం దక్కనుంది. ఇంటర్ లోకల్ కేడర్ తాత్కాలిక బదిలీలకు అనుమతి ఇవ్వనున్నారు. మొదట 2 ఏళ్లు… గరిష్టంగా 3 ఏళ్లు మాత్రమే ఉండనున్నారు.

GO 190 ప్రకారం. ఖాళీలు ఉన్నపుడే బదిలీలకు అవకాశం ఉండనుంది. డిసిప్లినరీ కేసులు ఉన్నవారికి అవకాశం లేదని స్పష్టం చేస్తోంది జీవో. డిప్యుటేషన్ ఉద్యోగులకు TA/DA లేదని… ఒకసారి సౌకర్యం పొందిన వారికి మళ్లీ అవకాశం లేదని వెల్లడిస్తోంది. జీఓ 317 తర్వాత ప్రమోషన్ పొందిన వారికి అర్హత లేదని…. బదిలీలపై తుది అనుమతి శాఖ అధిపతులకు ఇచ్చింది రేవంత్ ప్రభుత్వం.