హైదరాబాద్‌లో ఒకేరోజు ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యం అయ్యాయి. దీంతో భయాందోళనలో నగర వాసులు ఉన్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గోనసంచిలో ఉన్న మహిళ మృతదేహం లభ్యం అయింది. సంచి నుండి దుర్వాసన రావడం, మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉండడంతో రెండు రోజుల క్రితమే హత్య జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బీహారుకు వెళ్లే రైలు కోసం నిన్న అనేక మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు వచ్చారని, వారు వెళ్లిన తరువాత సంచీలో మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులకు తెలిపారు ఆటో డ్రైవర్. మృతి చెందిన మహిళ వయస్సు 30 నుండి 40 ఏళ్ల మద్యలో ఉంటుందని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.