తిరుమల శ్రీవారి దర్శనానికి ఏకంగా 24 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో… క్రమక్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. దీంతో తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని టిటిడి ప్రకటన చేసింది.

నిన్న ఒక్కరోజే 63607 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 23,856 మంది తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్కరోజే 3.87 కోట్లు తిరుమల శ్రీవారి హుండీకి చేరుకుంది. ఇక అటు తిరుమలలో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. వర్షం దంచికొట్టడంతో తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణం జలమయం అయింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతసేపు ఆలయ పరిసర ప్రాంతాల్లో నీటి మడుగులు ఏర్పడ్డాయి. వర్షం తీవ్రత కారణంగా ట్రాఫిక్ కూడా కొంతసేపు అంతరాయం కలిగింది. తిరుమలలో ఎప్పటికప్పుడు వర్షం కురుస్తుండటంతో TTD అధికారులు అప్రమత్తం అవుతున్నారు.