పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ఓజి సినిమా టికెట్లను ఏపీ సర్కార్ తాజాగా పెంచింది. అయితే టికెట్ల ధరలు పెంచడంపై… వైసిపి పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి బెనిఫిట్ షో కు వెయ్యి రూపాయలు ఏంటి అని వైసిపి పార్టీ నిలదీస్తోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారని ఫైర్ అవుతోంది.

ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని వైసీపీ మండిపడుతోంది. కాగా, పవన్ కళ్యాణ్ OG సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. “OG” సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షో టికెట్ ధర రూ.1000 ఫిక్స్ చేశారు. 25న విడుదలవుతున్న “OG” సినిమాకు అర్థరాత్రి 1.00 గంటకు బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చింది కూటమి ప్రభుత్వం.
- టిక్కెట్ ధరలు ఒక సారి పరిశీలిస్తే..
- సింగిల్ స్క్రీన్: ఒక్కో టికెట్‌పై రూ.125/- (GST సహా)
- మల్టీప్లెక్స్: ఒక్కో టికెట్‌పై రూ.150/- (GST సహా)