రాంగోపాల్ వ‌ర్మ‌పై కేసు నమోదు

-

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ కు ఊహించ‌ని షాక్ తగిలింది. ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు అయింది. ‘దహనం’ వెబ్ సిరీస్ వ్యవహారంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా ఫిర్యాదుతో కేసు నమోదు అయింది. మావోయిస్టులపై తీసిన ఆ వెబ్ సిరీస్‌లో తన పేరును ప్రస్తావించడం పై ఫిర్యాదు చేశారు అంజనా సిన్హా.

rgv
rgv

తన ప్రమేయం లేకుండా తన పేరు వాడినందుకు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అంజనా సిన్హా. మరోవైపు, అంజనా సిన్హా చెప్పిన విధంగా కొన్ని సీన్లు తీశామని చెబుతున్నారు వర్మ. ఇక ఈ సంఘ‌ట‌న‌పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

రామ్ గోపాల్ వర్మ వివరణ

మరోవైపు, అంజనా సిన్హా ఆరోపణలను రామ్ గోపాల్ వర్మ ఖండించారు. తాను అంజనా సిన్హా చెప్పిన కథనాల ఆధారంగానే కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు వర్మ తెలిపారు. దీనిపై మరింత సమాచారం అందుబాటులో లేదు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news