గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా రూ. 1.98 లక్షల కోట్ల పెట్టుబడితో 20వేల మెగావాట్ల రీయుజబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. 2030 నాటికి ఈ పాలసీతో 1.14 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా మెగావాట్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి రంగం సిద్ధమైందని అన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. ప్రతి వ్యక్తికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో చాలామందికి రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఇంటింటికి ఉచిత కరెంటు అందించారు. తెలంగాణలోని మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. రైతులకు రుణమాఫీ నిధులను మంజూరు చేశారు. రైతు భరోసా నిధులను కూడా రైతుల అకౌంట్లలో జమ చేశారు. ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ లను త్వరలోనే అందించనున్నారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాగ్రి డబ్బులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తోంది. ఇది మాత్రమే కాకుండా అనేక రకాల సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకువచ్చి తెలంగాణను అభివృద్ధి చేసే దిశగా ముందడుగు వేస్తున్నారు.