పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకుడిగా రాబోతున్న చిత్రం “OG”. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈనెల 21న ఉదయం 10.08 గంటలకు ఓజి సినిమాను రిలీజ్ చేస్తామంటూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ నెల 25న రిలీజ్ అయ్యే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓజి సినిమాకు తమన్ సంగీతం అందించారు.

కాగా, సినిమా టికెట్ల ధరలను పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనుమతులను జారీ చేసింది. మరి తెలంగాణలో కూడా టికెట్ ధరలు పెరుగుతాయా లేదా అనే సందేహాలు చాలా మందిలో నెలకొన్నాయి. ఈ విషయంపైన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అభిమానులు ఇప్పటికే సినిమా టికెట్ ధరలు భారీగా ఉన్నాయని మరోసారి టికెట్లు ధరలను పెంచితే సామాన్య ప్రజలు సినిమాలు చూసేందుకు పెద్దగా ఆసక్తిని చూపించారని అంటున్నారు.