ఏపీలో ఓ మందుబాబు రచ్చ చేశాడు. మద్యం మత్తులో పాము తలను కొరికేశాడు మందుబాబు. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చియ్యంవరం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం సేవించి ఇంటికి వెళుతున్న వెంకటేష్ ను కాటు వేసింది పాము.

ఇక ఈ తరుణంలోనే… మద్యం మత్తులో పాము తలను కొరికి ఇంటికి వెళ్లాడు వెంకటేష్. అనంతరం అతన్ని శ్రీకాళహస్తి ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. వెంకటేష్ పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఇక అతని పరిస్థితి గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇలాంటి సందర్భాల్లో పాము కాటు తర్వాత ఆలస్యం చేయకుండా తక్షణమే ఆసుపత్రికి చేరుకోవడం అత్యంత కీలకం