చిట్ చాట్ లో పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని వెల్లడించారు రేవంత్ రెడ్డి. నేను కూడా ఈరోజు ప్రోగ్రాంలో ఎంతో మందికి కండువాలు కప్పాను… ఆ కండువా ఏంటో కూడా వాళ్ళు చూసుకోకుండా కప్పించుకున్నారని స్పష్టం చేశారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు కలిసి కవితను బయటకు వెళ్లగొట్టారని ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో ఆస్తి పంపకాల తగాదా ఉందని… తెలంగాణలో ఎంతో మంది ప్రజల ప్రాణాలను కేసీఆర్ పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహించారు.
వాళ్ల ఉసురు తగిలే కేసీఆర్ కు కవిత దూరమైందన్నారు.