జర్నలిస్ట్ మూర్తిపై సినీ నటి మంచులక్ష్మి ఫిర్యాదు

-

సినీ నటి మంచులక్ష్మి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. జర్నలిస్ట్ మూర్తిపై సినీ నటి మంచులక్ష్మి ఫిర్యాదు చేశారు. ఇంటర్వ్యూ సమయంలో అడిగిన ఓ ప్రశ్న తన గౌరవానికి భంగం కలిగించిందని ఫిల్మ్ ఛాంబర్‌కు కంప్లైంట్ ఇచ్చారు సినీ నటి మంచులక్ష్మి. అది ఇంటర్వ్యూ కాదు ఎటాక్ అని.. అది జర్నలిజం కాదు, క్రిటిక్ కూడా కాదంటూ మంచు లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

Film actress Manchulakshmi files complaint against journalist Murthy
Film actress Manchulakshmi files complaint against journalist Murthy

సినిమా గురించి కాకుండా వయసు, దుస్తులపై మాట్లాడుతూ బాడీ షేమింగ్ చేసేలా యత్నించారని ఆవేదన వ్య‌క్తం చేశారు సినీ నటి మంచులక్ష్మి. కేవలం పాపులర్, వైరల్ అవ్వడం కోసం.. ఇతర వ్యక్తుల గౌరవాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని మండిప‌డ్డారు. మౌనంగా ఉంటే ఇదే బిహేవియర్ కంటిన్యూ అవుతుందని.. అందుకే తాను ఫిర్యాదు చేస్తున్నానంటూ వివరణ ఇచ్చారు. డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడంతో పాటు ఒక ఫార్మల్ వార్నింగ్ ఇవ్వాలని.. ఫిల్మ్ ఛాంబర్‌ని కోరారు మంచులక్ష్మి.

Read more RELATED
Recommended to you

Latest news