కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య సవాల్..కాంగ్రెస్ జెండా ప‌ట్టుకుని తిరుగు అంటూ !

-

కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య సవాల్ విసిరారు. ప్రజల అభీష్టం మేరకే కడియం పార్టీ మారి ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జెండా పట్టుకుని తెలంగాణ మొత్తం తిరగాలని.. పూలదండలు వేస్తారో లేక చెప్పుల దండ వేస్తారో కడియం సిద్ధంగా ఉండాలని కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య సవాల్ విసిరారు.

Thatikonda Rajaiah slams again on kadiyam srihari
Tatikonda Rajaiah challenges Kadiyam Srihari

కడియం శ్రీహరి అవినీతి తిమింగలం అని ఆరోప‌ణ‌లు చేశారు తాటికొండ రాజయ్య. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆస్తులు అమ్ముకుంటే.. కడియం మాత్రం ఆస్తుల మీద ఆస్తులు కొంటున్నాడని వెల్ల‌డించారు. కావాలంటే మా ఇద్దరి ఆస్తులను చూడండన్నారు తాటికొండ రాజయ్య. డియం శ్రీహరి నిన్న విడుదల చేసి కాగితం కేవలం చిత్తు కాగితం.. అది ప్రొసీడింగ్ కాపీ కాదు, కేవలం ప్రపోజల్ మాత్రమేన‌న్నారు. కనీసం సంతకం పెట్టే ధైర్యం లేని పిరికివాడు కడియం శ్రీహరి అని ఆగ్ర‌హించారు తాటికొండ రాజయ్య.

Read more RELATED
Recommended to you

Latest news