తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద, అణగారిన వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూతనిచ్చేందుకు, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు ముఖ్యమైన పథకాలను ప్రారంభించారు: ‘రేవంత్ అన్నాకా సహారా’ మరియు ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన’. ఈ పథకాలు సమాజంలో ఒక కొత్త మార్పును తీసుకొచ్చే లక్ష్యంతో రూపొందించబడ్డాయి. ఈ రెండు పథకాల వివరాలు తెలుసుకుందాం.
రేవంత్ అన్నాకా సహారా: ఈ పథకం ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన మరియు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడింది. ప్రధానంగా, ఆర్థికంగా నిలదొక్కుకోలేని కుటుంబంలో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ పథకం కింద ₹5 లక్షల ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఇది ఆ కుటుంబానికి ఒక ఊరట భవిష్యత్తుకు ఒక భరోసా. ఈ పథకం ద్వారా మరణించిన వ్యక్తిపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతవరకు బయటపడే అవకాశం ఉంది.

ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన: ఈ పథకం మైనారిటీ వర్గానికి చెందిన మహిళల సాధికారతకు కృషి చేస్తుంది. ఈ పథకం కింద, ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన్, బౌద్ధ, పార్సీ వర్గాల మహిళలకు స్వయం ఉపాధి కల్పన కోసం ఆర్థిక సహాయం కింద 50,000 రూపాయలు అందించబడుతుంది. ఈ పథకం ద్వారా మహిళలకు చిన్నపాటి వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు, లేదా ఇతర ఉపాధి మార్గాలను ప్రారంభించడానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఈ సహాయం ద్వారా వారు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగడానికి, కుటుంబానికి తోడుగా నిలబడటానికి వీలవుతుంది. ఈ పథకం మైనారిటీ మహిళల జీవితంలో ఆర్థిక మార్పును తెస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రెండు పథకాలు రేవంత్ అన్నాకా సహారా మరియు ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, సమాజంలోని అత్యంత బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో రూపొందించబడ్డాయి. ఈ పథకాలకు అక్టోబర్ 6 వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ పథకాలు ఆర్థిక చేయూత ఉపాధి కల్పన ద్వారా ప్రజల జీవితాలను మెరుగుపరుస్తాయి.